70 సంవత్సరాల మహిమ గల దేవాలయం..ఈ దేవాలయంలో ఊడిస్తే చాలు..!

హిందూ సంప్రదాయాల ప్రకారం చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా చాలామంది ప్రజలు భావిస్తారు.ఇది లక్ష్మీదేవి నివాసంగా కూడా నమ్ముతారు.

 A Temple With 70 Years Of Glory.. Just Blow In This Temple..! ,lakshmi Devi , Ra-TeluguStop.com

గ్రంధాలలో కూడా చీపురుకు ప్రత్యేక స్థానం ఉంది.అందుకే చీపురును ఇంట్లో పెట్టుకోవడానికి కూడా కొన్ని వాస్తు నియమాలను అనుసరిస్తారు.

ఇంట్లోనీ మురికిని శుభ్రం చేయడమే కాకుండా పేదరికన్ని తొలగిస్తుంది.రాజ్కోట్ లో ఉన్న ఈ దేవాలయం ఎంతో మహిమాన్విత్వమైన మహాలక్ష్మి మాతాజీ ఆలయం అనీ స్థానికులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Rajkot, Shreemahalaxmi-Latest News - Te

ఈ దేవాలయంలో చీపురు సమర్పిస్తే చాలు దరిద్రం తొలగిపోతుంది.అందుకే ఈ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా చీపురును సమర్పిస్తారు.ఈ మహాలక్ష్మి మాత దేవాలయం రాజకోట్( Rajkot ) లోని కేవాడ్ వాడి ప్రాంతంలో ఉంది.దీపావళి దంతేరాస్ రోజులలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.

ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి భక్తులు చీపురును సమర్పించడానికి పెద్ద ఎత్తున తరలివస్తారు.ఈ దేవాలయానికి రెండు చీపుర్లు తీసుకోరవాలని ఇక్కడి పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Rajkot, Shreemahalaxmi-Latest News - Te

అందులో ఒకటి అమ్మవారికి సమర్పించి మరొకటి భక్తులు తమ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు.ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుందని చెబుతున్నారు.తమ కోరిక నెరవేరాలంటే వెంటనే ఈ దేవాలయాన్ని సందర్శించి చీపురుతో ఆలయాన్ని శుభ్రం చేయడం ఆచారంగా వస్తుంది.అంతే కాకుండా ఈ దేవాలయం 70 సంవత్సరాలు నాటిది అని చెబుతున్నారు.

ఇక్కడి నుంచి తీసుకెళ్లిన చీపురు మురికిగా ఉండే ప్రదేశాలలో ఉంచకూడదు.ఇలా చేస్తే లక్ష్మీదేవి( Lakshmi devi )కి కోపం వస్తుంది.

అలాగే చెత్తలో పాడవేయకూడదు.ఇంకా చెప్పాలంటే ఎవరికి కనిపించని విధంగా ఇంట్లో చీపురు పెట్టుకోవాలి.

లక్ష్మీదేవికి సమర్పించిన చీపురులతో ఇంటిని శుభ్రపరచడం ద్వారా ఇంటి దరిద్రం తొలగిపోతుంది.అలాగే ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయని ప్రజలు నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే చీపురు బయటపడేయాలంటే అమావాస్య, శనివారం రోజు చేయాలి.కొన్నిసార్లు గ్రహణం ఏర్పడితే గ్రహణం ముగిసిన తర్వాత కూడా మీరు పాత చిపురును బయటపడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube