ఈరోజు వైకుంఠ ఏకాదశి.ఈ సందర్భంగా భక్తులంతా శ్రీ మహావిష్ణువు( Lord vishnu )ను పూజిస్తారు.అలాగే ఉపవాసం కూడా ఉంటారు.అయితే ఈరోజు వ్రతం చేస్తూ ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.వైకుంఠ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.
కాబట్టి ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే ఈ రోజున విష్ణుమూర్తి స్వర్గ నివాసమైన వైకుంఠం తలుపులు తెరిచే ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఏకాదశి నాడు విష్ణుభక్తులు ఉపవాసం చేస్తారు.అలాగే విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొంటారు.
దీనిలో మోక్షాన్ని కూడా కోరుకుంటారు.అయితే ఈరోజు విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే ఈ భూమి మీద తమ ప్రయాణం ముగిసిన తర్వాత విష్ణువు పవిత్రమైన నివాసంలో ఆశ్రయం లభిస్తుందని భక్తుల నమ్మకం.అయితే ఉపవాసం నాడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంతకుముందు ఎప్పుడైనా ఉపవాసం ఉండకపోయినా లేదా అనారోగ్య సమస్య ఉన్నట్లయినా డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఉపవాసం ఉండాలి.
వైకుంఠ ఏకాదశి వ్రతం సాధారణంగా దశమి తిథికి ఒక రోజు ముందే మొదలవుతుంది.కాబట్టి విష్ణుభక్తులు దశమి రోజు భోజనం చేయకూడదు.ఈరోజు కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
ఇక ఏకాదశి తిథినాడు బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurat )లోనే నిద్రలేవాలి.అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందు లేవాలన్నమాట.ఇక ధ్యానం తర్వాత ప్రతిజ్ఞ చేసి ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించాలి.
ఇక బియ్యం, గోధుమలు, కాయ ధాన్యాలను అస్సలు తినకూడదు.అంతేకాకుండా ఆల్కహాల్, స్మోకింగ్ కు కూడా దూరంగా ఉండాలి.
అంతేకాకుండా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాన్ని ఈరోజు అస్సలు తినకూడదు.అయితే ఆరోజు సాబుదానా కిచిడి, సాబుదానా వడ, ఆలు సబ్జీ, లాంటి పండ్లు, పాలు, వ్రత వంటకాలను తీసుకోవచ్చు.
ఇక విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
DEVOTIONAL