అందరికీ తెలిసిన విధంగానే ఎంత బాగా నిద్రపోతే మనం అంత బాగా పని చేసుకోవడం, అలాగే చూడడానికి చాలా బాగా కనపడుతాము.ఒకవేళ ముందు రోజు రాత్రి సరిగా నిద్ర లేకపోతే తెల్లవారేసరికి మనకి ఎక్కడలేని నిరుత్సాహం మొత్తం మన ముఖంలోనే కనబడుతుంటుంది.
నిద్రపోకపోవడం ద్వారా కళ్ళు బాగా ఉబ్బినట్లు కనపడుతూ, కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ రావడంతో పాటు ముఖం పొడిబారినట్లు క్లియర్ గా కనబడుతోంది.దీనికి ప్రధాన కారణం ప్రస్తుత రోజుల్లో అందరూ కచ్చితంగా మొబైల్ ఫోన్స్, టీవీ చూడటం, కంప్యూటర్ ఉపయోగించడం లాంటి పనుల్ని చేస్తూ ఉండడం.
వీటి ద్వారా వచ్చే కాంతి కిరణాలు ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలను పొందాల్సి ఉంటుంది.ఇవి కాకుండా మంచి సంగీతం వినడం, అలాగే ధ్యానం చేసుకోవడం వంటివి చేయడం ద్వారా ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక అలాగే నిద్రపోయే ముందు ఖచ్చితంగా వారు వేసుకున్న మేకప్ ను మాత్రం తీసివేసి పడుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.దీనికి కారణం మేకప్ వేసుకున్న తర్వాత ఆపై రోజు అంతా బయట తిరిగిన సమయంలో ఏర్పడిన జిడ్డు, మురికి ఇలాంటివన్నీ కలిసి చర్మపు పొరలలోకి వెళ్లిపోతాయని దానివల్ల సౌందర్యం చెడిపోతుంది కాబట్టి, పూర్తిగా తొలగించాలని నిపుణులు తెలుపుతున్నారు.
అలాగే నిద్రపోయే సమయంకి ఖచ్చితంగా రెండు లేదా మూడు గంటల సమయం ముందే ఆల్కహాల్ తీసుకోవాలని, ఇలా చేయడం ద్వారా సౌండ్ స్లీప్ ఉండదు.ఒకవేళ బయట రాత్రివేళ పార్టీ ఉన్నా, పనికి సంబంధించి ఫంక్షన్స్ లో ఆల్కహాల్ సేవించడం చేసే సమయంలో నిద్రపోయే సమయానికి కనీసం రెండు గంటల ముందు ఆల్కహాల్ తీసుకోవాలని అలా తీసుకున్న తర్వాత కేవలం నీరు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక అలాగే రాత్రిపూట మేకప్ రిమూవ్ చేసిన తర్వాత నైట్ స్కిన్ కేర్ అప్లై చేయడం కూడా చాలా అవసరం.వీటిని వాడటం ద్వారా చర్మాన్ని ఎంతగానో కాపాడతాయి కూడా.అలాగే రాత్రి పడుకునే సమయంలో లిప్ బామ్ రాసుకోవడం ద్వారా పెదాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.మనిషి అందంలో పెదాలు ఎంతో ప్రాముఖ్యం చెందినది కాబట్టి వాటిని కూడా కాపాడుకొనే ప్రయత్నం చేసుకోవాలి.
రాత్రి పడుకునే ముందు లిప్ బామ్ రాసుకోవడం ద్వారా పెదాలపై మంచి ఎఫెక్ట్ గా అది పనిచేస్తుంది.కాబట్టి పడుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యం, అలాగే అందం రెండు మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది.