సినిమా విజయంలో సంగీతం ఎంతో కీలకం.పాటలే కాదు దానికి తగిన డ్యాన్స్ కూడా ముఖ్యమే.
పాటకు తగ్గట్లు పాదం కదిపితేనే ప్రేక్షకులు వారెవ్వా అంటారు.డైలాగులు, ఫైట్లే కాదు ప్రస్తుత సినిమాల్లో దుమ్మురేపే డ్యాన్సులు ఆడియెన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.
టాలీవుడ్ హీరోల్లో నలుగురు సూపర్ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు.ఇంతకీ ఆ హీరోలెవరు? దుమ్మురేపే ఆ పాటలేంటో ఇప్పుడు చూద్దాం!.
అల్లు అర్జున్:

టాలీవుడ్లో అద్భుతంగా డ్యాన్సలు చేస్తున్న హీరో అల్లు అర్జున్.మంచి ఊపున్న సాంగులకు దుమ్మురేపే స్టెప్పులు వేస్తాడు ఈ సిక్స్ ప్యాకర్.తన డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఈయన సినిమాల్లో మంచి ఊపుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పాటలు టాప్ లేచిపోద్ది, బుట్ట బొమ్మ, సిటీమార్, మై లవ్ ఈజ్ గాన్, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో, సూపర్ మచ్చీ.
జూ.ఎన్టీఆర్:
తన తొలి సినిమా స్టూడెంట్ నెం.1తోనే అద్భుత డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. నాచోరే అంటూ ప్రేక్షకులను సందడి చేశాడు.తన సినిమాలన్నింటిలోనూ చక్కటి డ్యాన్సులతో అలరిస్తున్నాడు.నాచోరే నాచోరే, స్వింగు జర స్వింగ్ జర, పక్కా లోకల్, నైరే నైరే నైరే బాబా, శివ శంభో శివ శంభో పాటలు ఆయన కెరీర్ ది బెస్ట్ డాన్స్ సాంగ్స్ గా నిలిచాయి.

రామ్ చరణ్ తేజ్:మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన కూడా తన తొలిసినమా చిరుతలోనే సెప్పులతో దుమ్మురేపాడు.ఆయన డ్యాన్సులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఆయన కెరీర్లో బెస్ట్ సాంగ్స్ డిల్లకు ఢిల్లకు, లైలా ఓ లైలా, బంగారు కోడి పెట్ట, జిల్ జిల్ జిల్ జిగేలు రాణి, ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా!