సాధారణంగా చెప్పాలంటే ప్రస్తుత రోజులలో చాలా మంది ప్రజలు వారి పూర్వీకులను ( Ancestors )గుర్తు చేసుకుంటూ ఉంటారు.అలాగే వారి పేర్ల పై దానధర్మాలు మరియు పిండాలను చేస్తూ ఉంటారు.
పూర్వీకుల ఆశీర్వాదం కోసం వారి ఫోటోలను తమ ఇళ్లలో ఉంచుకుంటూ ఉంటారు.మన పూర్వీకుల ఫోటోలను ఉంచే ముందు మనం గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
పండితులు( Scholars ) చెప్పిన దాని ప్రకారం మనం పూర్వీకుల ఫోటోలను ఉంచడం గురించి చాలా విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం మన పూర్వీకుల ఫోటోలను ఇంట్లో ఎప్పుడూ వేలాడదీయకూడదని వాటిని ఎప్పుడూ చెక్క స్టాండ్ పై ఉంచాలని చెబుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూర్వికుల ఫోటోలు ఎక్కువగా పెట్టకూడదు.అంతేకాకుండా మన పూర్వీకుల చిత్రాలను( Ancestral images ) అందరి ముందు ఉంచకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం మన పూర్వీకుల బొమ్మలను చూడడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడి చిత్రాలను, పూర్వీకుల చిత్రాలను వేరు వేరు ప్రదేశాలలో ఉంచాలి.
దేవుళ్ళ మరియు పూర్వీకుల చిత్రాలను ఇంట్లో ఒకే చోట ఉంచితే జీవితంలో కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు.
కాబట్టి పూజ స్థలం నుంచి పూర్వీకుల చిత్రాలను దూరంగా ఉంచడమే మంచిది.వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఇంటి మధ్యలో వంట గది లేదా పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు.ఈ ప్రదేశాలలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం వల్ల ఇంటి శాంతికి భంగం కలుగుతుంది.
ఇంకా చెప్పాలంటే పూర్వీకుల చిత్రాలను గోడకు ఉత్తరం వైపు మాత్రమే ఉంచాలి.మత గ్రంథాల ప్రకారం దక్షిణన్ని కూడా పూర్వికుల దిశగా భావించవచ్చు.
అంతేకాకుండా పూర్వీకుల చిత్రాలను ఎప్పుడూ గదిలో ఉంచకూడదు.ఎందుకంటే ఇది వారి వయస్సును తగ్గించే అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU