ఈ నెల 20 లోపు బీసి కుల, చేతి వృత్తుల వారు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్( VP Gautam ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ( Telanagan )బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిందని, బిసి కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే ప్రజలు ఆన్ లైన్ లో https://tsobmmsbc.cgg.gov.in నందు జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తుదారుల అర్హత వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలని, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు ఉండాలని అన్నారు.గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ది పొందిన వారు ఈ ఆర్థిక సహాయానికి అనర్హులని ఆయన తెలిపారు.
బీసి కులవృత్తులు, చేతి వృత్తుల ఆర్థిక సహాయం కోసం అర్హత కల్గిన లబ్దిదారులు ఆన్ లైన్ నందు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు పాస్ బుక్ జత చేస్తూ జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.