కార్తీక మాసంలో( Karthika Masam ) ప్రతి ఇల్లు దీపాల వెలుగులో ఉంటుంది.అలాగే పూజలు, వ్రతాలు, దీపారాధనతో మహిళలంతా ఎంతో బిజీగా ఉంటారు.
కార్తీక మాసంలో శుక్లపక్ష పున్నమి తిథిలో 15వ రోజు వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది.దీన్నే కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమి అని కూడా అంటారు.
ఈ రోజున సూర్యుడు ఉదయించక ముందే మహిళలంతా తలస్నానం చేసి, ఇంటి ముందు ముగ్గులు పెట్టి, తులసి కోట దగ్గర 365 వత్తుల్ని( 365 Wicks ) ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తారు.అలాగే బియ్యప్పిండి, ఉసిరికాయలతో చేసిన దీపాలను కూడా వెలిగిస్తారు.
ఆ తర్వాత శివుడి దేవాలయానికి వెళ్లి గుమ్మడి ఆకు, వక్క, పండ్లను బ్రాహ్మణులకు దానం ఇస్తారు.ముత్తైదువులకి వాయినాలు ఇస్తారు.ఈ రోజంతా ఉపవాసం( Fasting ) ఉండి సాయంత్రం అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పసుపు, కుంకుమ, చల్లి నదులు, కాలువలో వదులుతారు.ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు తమ వెంట వస్తాయని కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందని నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజు ఉసిరి దీపాలను వెలిగించడంతో పాటు శివుడికి ఇష్టమైన ఉసిరి చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు.ఉసిరి చెట్టు నీడలో తలస్నానాలు కూడా చేస్తారు.
ఈ ఆచారాన్ని ఉసిరి కాయ స్నానం అని పిలుస్తారు.
స్నానం చేసేటప్పుడు కార్తీకే హం కరిష్యామి వ్రత స్నానం జనార్ధన.ప్రీత్యర్థం.దేవేశ దామోదర మయనహ అనే మంత్రం చదివితే మంచిదని పండితులు చెబుతున్నారు.
ఉపవాసం ఉండి సాయంత్రం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అలాగే ఈ రోజు దీపాన్ని దానం చేస్తే చాలా పుణ్యఫలితం లభిస్తుంది.
బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాలతో పాటు స్థోమతని బట్టి వెండి ప్రమీదాలను కూడా దానం చేయవచ్చు.కార్తిక మాసం అంతా ఇంటి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెడతారు.
పౌర్ణమి రోజు ఇంట్లో తులసి పూజ చేసి వత్తులు వెలిగించడం యజ్ఞం చేయడంతో సమానమని పండితులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU