ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది.తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు( Telangana Lok Sabha Elections ) జరుగుతూ ఉండగా ఆంధ్రాలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రాలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు.
అలాగే మరికొందరు రాజకీయ నాయకులను ( Political Leaders )సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య సినీనటి రేణు దేశాయ్ ( Renu Desai ) సైతం ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు.అయితే ఈ బీజేపీకి మద్దతు తెలియజేస్తూ ఇటీవల తన చేతిపై కమలం టాటూ వేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా మరోసారి బిజెపి నేత( BJP Leader )ను సపోర్ట్ చేస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
బిజెపి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మాధవి లత ( Madhavi Latha )ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే.
మాధవీలత ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తున్న హావభావాలు సోషల్ మీడియా<( Social Media )/em>లో వైరల్ అవుతున్నాయి.మాధవీలత ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్… చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్( Strong Woman ) ని చూశాను.ఈ పోస్ట్ పెట్టడానికి నేను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారంటూ విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో ప్యాకేజీ తీసుకోలేదంటూ రేణు దేశాయ్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.