ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) అరెస్ట్ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది.ఈ మేరకు న్యాయవాది సింఘ్వి కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావించారు.
కేజ్రీవాల్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్ ఏప్రిల్ 29వ తేదీకి బదులు మే 6 తేదీన చూపుతుందని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి( Abhishek manu Singhvi ) కోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్ పై ఈ నెల 29నే విచారణ జరపాలని అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనాన్ని కోరారు.
దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కేసు వివరాల ఈ -మెయిల్ ను పంపాలని, ప్రస్తావనకు తెచ్చిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.







