ఈసారి ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి పవన్ ఓడిపోవడం జరిగింది.దీంతో ఈసారి ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
మొన్నటి వరకు జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన హైపర్ ఆది, గెటప్ శీను, రాంప్రసాద్.పిఠాపురంలో పవన్ ని గెలిపించాలని ప్రచారం చేశారు.ఇదిలా ఉంటే తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ శనివారం పిఠాపురంలో( Pithapuram ) ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం ప్రారంభం కానున్న రోడ్ షో.వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.మరోవైపు ఖమ్మంలో రఘురాం రెడ్డి, కైకలూరులో కామినేని శ్రీనివాస్ తరఫున హీరో విక్టరీ వెంకటేష్ కూడా ప్రచారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈసారి పవన్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మే 5వ తారీఖు పిఠాపురంలో చిరంజీవి జనసేన తరుపున ప్రచారం చేసే అవకాశం ఉందని టాక్.