మాజీ మంత్రి వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్( Dokka Manikya Varaprasad ) టీడీపీలో చేరారు.కొద్దిసేపటి క్రితం చంద్రబాబు డొక్కాకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈరోజు ఉదయమే డొక్కా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి…పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖను సీఎం జగన్( CM Jagan ) కు పంపించారు.2024 ఎన్నికలకు సంబంధించి.అసెంబ్లీ టికెట్ ఆశించిన డొక్కా కి టికెట్ రాలేదు.దీంతో ఆయన గత కొన్నాల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం జరిగింది.తీవ్ర మనస్థాపానికి గురైన డొక్కా చివరాఖరికి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవి హామీతోనే డొక్కా వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు గుంటూరు జిల్లా రాజకీయాలలో ప్రచారం జరుగుతుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.2014లో మాదిరిగా మరోసారి టీడీపీ.బీజేపీ.జనసేన ( TDP, BJP, Jana Sena )ర్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.ఈ మూడు పార్టీలు గతంలో కలిసి పోటీ చేసిన సమయంలో గెలవడం జరిగింది.మరి ఈసారి పొత్తుల వ్యవహారం కలసి వస్తుందా.? లేదా.? అన్నది ఆసక్తికరంగా మారింది.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్.వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఇద్దరు కలిసి గత రెండు వారాల నుండి ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటున్నారు.మరోపక్క బీజేపీ కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
మే నెలలో ప్రధాని మోదీ రెండు రోజులపాటు ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నన్నారు.