చింతలపూడి ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ పై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా పుంజుకోవడం జరిగింది.విభజన జరిగిన తర్వాత రెండు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని జనాలు ఎవరు పట్టించుకోలేదు.

కానీ ఎప్పుడైతే వైయస్ షర్మిల.కాంగ్రెస్ లో  జాయిన్ అయిందో.

అధ్యక్ష పదవి అందుకుందో ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం జరిగింది.ఇటీవల అధికార పార్టీకి చెందిన నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఇదిలాఉండగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చింతలపూడి ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ రకంగానే చింతలపూడి ఎమ్మెల్యే ఏలిజా… కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

ఈ క్రమంలో శుక్రవారం చింతలపూడిలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

-Latest News - Telugu

ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు చేశారు.5 ఏళ్ల క్రితం 23 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పారని అన్నారు.ఐదేళ్లలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ.దగా డిఎస్సి తీసి.నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వైయస్సార్ శంకుస్థాపన చేసిన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే ఎలిజా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని షర్మిల స్పీచ్ ఇచ్చారు.ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అంటూ విమర్శించారు.

ఈ పది సంవత్సరాలలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.పరిశ్రమలు కూడా రాలేదు.

విభజన హామీలు కూడా.తెలుగుదేశం మరియు వైసీపీ ప్రభుత్వాలు నెరవేర్చుకోలేకపోయాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీలు నెరవేరుస్తామని షర్మిల ప్రసంగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube