తెలంగాణ రాష్ట్ర గీతం( Telangana State Anthem )రూపకల్పన తుది దశకు చేరుకుంది.ఈ మేరకు గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్ కోదండరాం మరియు కాంగ్రెస్ అధికారులు పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు కీరవాణి సారథ్యంలో రాష్ట్ర గీతాన్ని రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే.