దేశంలో చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి.జూన్ ఒకటవ తారీకు ఎనిమిది రాష్ట్రాలలో 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈసారి ఎన్నికల ప్రచారాలలో ప్రధాని మోదీ( PM Modi ) సంచలన రికార్డు సృష్టించారు.206 ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.మొత్తం 80 ఇంటర్వ్యూలు ఇవ్వటం జరిగింది.
ఇదిలా ఉంటే చివరి రోజు వారణాసి ఓటర్లకు( Varanasi Voters ) మోదీ వీడియో సందేశం ఇవ్వడం జరిగింది.కాశీ నగరం భక్తి, శక్తి, విరక్తికి ప్రతీక.
కాశీ విశ్వ సాంస్కృతిక రాజధాని.గంగా మాతా నన్ను దత్తత తీసుకుంది.
ఈసారి పోలింగ్ లో కాశీ కొత్త ఓటర్లు కొత్త రికార్డు సృష్టించాలి అంటూ మోదీ లెటర్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది.వారణాసి నుండి మరోసారి మోదీ ఎంపీగా పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే కేంద్రంలో రెండుసార్లు వరుసగా బీజేపీ ( BJP ) గెలవడం జరిగింది.మూడోసారి కూడా గెలిచి రికార్డు సృష్టించాలని భావిస్తుంది.ఈ క్రమంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవడానికి ఎన్డీఏ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది.ఈసారి ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక ప్రచార కార్యక్రమాలతో పాటు చాలా టీవీ చానల్స్ కి ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇవ్వటం సంచలనంగా మారింది.
మొత్తం ఏడు దశలలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.ఇప్పటికే ఆరు దశల ఎన్నికల ముగిసాయి.ఇక చివరి దశ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి.జూన్ 1వ తారీఖు నాడు చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి.