టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్( Young hero Sharwanand ) గురించి మనందరికీ తెలిసిందే.శర్వానంద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ 2 సినిమాలు చేస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే హీరో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తాజాగా నటించిన చిత్రం భజే వాయువేగం( Bhaje vayuvegam ).

ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ ఈవెంట్ కీ చీఫ్ గెస్ట్ గా హీరో శర్వానంద్ హాజరయ్యాడు.ఈ సందర్భంగా కార్తికేయ, శర్వానంద్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు.రామ్ చరణ్ అన్న, ప్రభాస్ అన్న ఒకేసారి ఫోన్ చేస్తే ముందుగా ఎవరిని కలుస్తారు అని అడగగా.ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తాను.
ఆ తర్వాత ప్రభాస్ ని కలుస్తాను అంటూ శర్వానంద్ బదులిచ్చాడు.

ఇప్పుడు శర్వా చెప్పిన ఈ మాట టూ డే టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది.ఎందుకంటే చరణ్, ప్రభాస్ ( Charan, Prabhas )లాంటి సూపర్ స్టార్స్ గురించి అలాంటి ప్రశ్న వస్తే సమాధానం చెప్పటానికి ఎవరైనా తడపడతారు.కానీ శర్వానంద్ మాత్రం వెంటనే ఎలాంటి తడబాటు లేకుండా చరణ్ ని ఫస్ట్ కలుస్తానని చెప్పాడు.
కాగా చెర్రీ,శర్వ ఇద్దరు చిన్నప్పటినుంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే.పైగా చరణ్ తో పాటే వాళ్ళ ఇంట్లో పెరిగాడు.చిరంజీవే చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ తెలిపారు.ఆ తరువాత క్రికెటర్స్ లో ఎవరని ఎక్కువగా ఆరాధిస్తారని కూడా కార్తికేయ అడిగాడు.
కింగ్ కోహ్లీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అని తెలిపారు.రోహిత్ శర్మ బయోపిక్ చేస్తావా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.
జీవితంలో క్రికెట్ ఆడను కాబట్టి నో అనే ఆన్సర్ ఇచ్చాడు.