విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.( Gangs Of Godavari ) ఇందులో నేహా శెట్టి అంజలి హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా మే 31వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.అయితే విడుదల దేనికి మరికొన్ని గంటలు మాత్రమే సమయము ఉండడంతో మూవీ మేకర్ ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాగా, ఈ వేడుకలో బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉన్నట్లుగా ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు మండి పడుతున్నారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ వీడియోపై నిర్మాత నాగవంశీ( Producer Nagavamshi ) క్లారిటీ ఇచ్చారు.ఆ ఈవెంట్ ను నిర్వహించింది తామేనని.
అక్కడ ఏముందో తమకు తెలుసని ఆయన అన్నారు.అయితే ఎవరో కావాలనే బాలయ్య కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉన్నట్లుగా సీజీ వర్క్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
దీంతో ఈ అంశంపై పూర్తి క్లారిటీ వచ్చిందని అభిమానులు అంటున్నారు.అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో కొందరు బాలయ్య బాబు పై ట్రోల్స్ చేయగా బాలయ్య బాబు అభిమానులు సదరు నెటిజన్స్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.ఇది ఇలా ఉంటే ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు పాటలు సినిమా బై అంచనాలను మరింత పెంచాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.