అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు జో బైడెన్.( Joe Biden ) 2024 ఎన్నికల్లోనూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తన చిరకాల ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌తో( Donald Trump ) ఆయన సై అంటున్నారు.ఇప్పటికే ఇద్దరికీ డెమొక్రాట్, రిపబ్లిక్ పార్టీ నామినేషన్‌లు అధికారికంగా దక్కాయి.
ఒకవేళ బైడెన్ కనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయనకు 81 ఏళ్లు వస్తాయి.ఆ వయసులో దేశాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించగల సత్తా ఆయనకు వుంటుందా వుండదా అన్న అనుమానాలు ఎప్పటి నుంచో రేకెత్తుతున్నాయి.
ఇప్పటికే వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బైడెన్ బాధపడుతున్నారు.ఈ నేపథ్యంలో 2029 జనవరి వరకు అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతారా లేక కమలా హారిస్‌కు( Kamala Harris ) బాధ్యతలు అప్పగిస్తారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు జో బైడెన్‌కు చిర్రెత్తుకొచ్చింది.
‘‘Are You ok ’’ , ‘‘ నీ తలకు ఏం కాలేదుగా ’’ అంటూ రిపోర్టర్‌కు ( Reporter ) కౌంటరిచ్చారు.ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఈ ఘటన జరిగింది.

సెకండ్ టర్మ్‌లో బైడెన్ పూర్తి కాలం అధ్యక్షుడిగా కొనసాగితే అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలకు చేరుకుంటుంది .వయస్సును దృష్టిలో ఉంచుకుని బైడెన్‌కు ఓటు వేస్తే.కమలా హారిస్‌కు వేసినట్లేనంటూ రిపబ్లికన్లు( Republicans ) ప్రచారం చేస్తూ ఉంటారు.కొన్ని పోల్స్ , ముందస్తు సర్వేల ప్రకారం వయసు కారణంగా జో బైడెన్ పూర్తికాలం పదవిలో ఉండకపోవచ్చునని మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు.
అటు కమలా హారిస్ పనితీరు గురించి కూడా విలేకరులు ప్రశ్నలు వేయగా.బైడెన్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఇటీవల వర్చువల్ డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ గ్రాస్ రూట్ ఈవెంట్‌లో బైడెన్ మాట్లాడుతూ.కమలా హారిస్‌కు ఎప్పుడూ నా మద్ధతు ఉంటుందని, ఆమె అద్భుతమైన వ్యక్తని ప్రశంసించారు.

ఇక కమలాహారిస్ విషయానికి వస్తే.వైస్ ప్రెసిడెంట్‌గా ఆమెకు సరైన స్వేచ్ఛ లభించడం లేదనీ, అసలు ప్రభుత్వంలో కమలకు ప్రాధాన్యత లభించడం లేదని కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వెల్లువెత్తాయి.కమలా హారిస్ రాజకీయంగా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.ఈసారి బైడెన్‌కు రన్నింగ్‌మెట్‌గా ఆమె ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.







