1.చంద్రబాబుపై రోజా ఆగ్రహం
టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజు మండిపడ్డారు.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదల ఇళ్లను సమాధులుగా సంబోధించడం దుర్మార్గమని ఆమె అన్నారు.
2.కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.
3.వైయస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబీపి మరోసారి నోటీసులు జారీ చేసింది.
4.హరీష్ రావు పర్యటన
నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు.
5.ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల
ఏపీ పాలీసెట్ ఫలితాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.
6.మంత్రి పాదయాత్ర
నేడు వేమూరులో ఏపీ మంత్రి మేరుగ నాగార్జున నిరసన పాదయాత్ర చేపట్టారు.పేదల ఇళ్ల స్థలాలను చంద్రబాబు స్మశానాలుగా పోల్చడాన్ని నిరసిస్తూ పాదయాత్ర చేపట్టారు.
7.2000 నోటు రద్దును స్వాగతిస్తున్నాం
2000 నోటును రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరడ్డి అన్నారు.
8.ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఏపీ బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది.
9.చంద్రబాబుపై కాకాని విమర్శలు.
టిడిపి అధినేత చంద్రబాబుకి తన కొడుకు లోకేష్ కూడా మోసం చేస్తాడనే అనుమానం ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
10.స్టీల్ ప్లాంట్ కు నాలుగువేల కోట్లు ఇస్తా : కేఏ పాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు రెడీ చేశానని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే సమస్య తీరుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
11.2000 నోటు రద్దు పై మంత్రి సంచలన కామెంట్స్
ఉపయోగం లేని 200 నోటును ఎందుకు అమల్లోకి తెచ్చారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
12.నేడు కూకట్ పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు నేడు కూకట్ పల్లిలో జరుగుతున్నాయి.
13.ఏపీ బీజేపీ జిల్లా ఇన్చార్జిల ప్రకటన
26 జిల్లాలకు బిజెపి ఇన్చార్జి పేర్లను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.
14.ఏపీలో పలువురు ఐఏఎస్ బదిలీలు
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు సీఎస్ జవహర్ రెడ్డి జీవో ఆర్టీ నెంబర్ 985 జారీ చేశారు.
15.సెలవులో ఏపీ డీజీపీ
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సెలవులోకి వెళ్లారు.ఆయన వ్యక్తిగత పనులపై విదేశీ పర్యటనలో ఉన్నారు.ఈనెల 18 నుంచి జూన్ 3 వరకు 16 రోజులు పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత సెలవులు మంజూరు చేసింది.
16.కొవ్వూరులో జగన్ పర్యటన
ఈనెల 24న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.
17.రేపు ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
రేపు ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది.దీనిని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభిస్తారు
18.ఎన్టీఆర్ ని తెలుగులో విష్ చేసిన హృతిక్ రోషన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 4 పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీఆర్ కు బాలీవుడ్ హీరో కృతిక్ రోషన్ సైతం తెలుగులో ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
19.మై హోమ్ రాజేశ్వరరావుకు సిఐఐ జీవిత సాఫల్య పురస్కారం
హైదరాబాద్ కు చెందిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రాజేశ్వర్ కు సిఐఐ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -56,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 61,420
.