మానసిక ప్రశాంతతను పొందేందుకు ఈ ఆసనాలు అతి ముఖ్యం..

చాలామంది మనసు ప్రశాంతత కోసం యోగాసనాలు చేస్తూ ఉంటారు.అయితే యోగా ద్వారా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

 These Asanas Are Very Important To Get Mental Peace, Asanas  , Mental Peace ,  H-TeluguStop.com

అయితే కొన్ని రకాల యోగా ఆసనాలతో కొన్ని రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.చాలామంది శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామలు చేస్తూ ఉంటారు.

అయితే కొన్ని యోగాసనాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.ఈ మధ్యకాలంలో చాలామంది మానసిక ప్రశాంతత లేక కుంగిపోతూ ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఎవరికీ తోచదు.కానీ వెంటనే మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి ఆసనాలు చేస్తే వెంటనే రిలాక్స్ అయిపోవచ్చు అంటున్నారు యోగా నిపుణులు.

అయితే శారీరిక ఆరోగ్యం కోసం, మానసిక ఆరోగ్యం కోసం యోగా ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు.యోగా శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఈ బిజీ లైఫ్ లో చాలామంది మానసిక ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడం లేదు.ఈ అధునిక యుగంలో ప్రతి వ్యక్తి కూడా ఒత్తిడికి గురవుతున్నారు.

Telugu Anxiety, Asanas, Flow, Tips, Immunity, Insomnia, Stress-Telugu Health

అందుకే మానసిక ఆరోగ్యాన్ని యోగ అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.అలాగే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.ఏకాగ్రతను కల్పించి, ఒత్తిడి, ఆందోళన కూడా దూరం చేస్తుంది.నిరాశ, నిద్రలేమి లక్షణాలను కూడా దూరం చేస్తుంది.అయితే యోగాలో అతి ముఖ్యంగా పలు ఆసనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తనాసనం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

Telugu Anxiety, Asanas, Flow, Tips, Immunity, Insomnia, Stress-Telugu Health

అయితే ఈ ఆసనం వెనుక కండరాలపై బాగా పనిచేస్తుంది.అయితే ఈ భంగిమలో తల గుండెకు దిగువగా ఉంటుంది.మెదడుకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఈ ఉత్తనాసనం రోజు చేయడం ద్వారా ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.అంతేకాకుండా మనస్సును ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.విపరీత కరణి ఆసనం కూడా మనిషిలో ఆందోళన తగ్గేందుకు సహాయపడుతుంది.

ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది.నిరాశ, నిద్రలేమి లాంటి సమస్యలను ఈ ఆసనం దూరం చేస్తుంది.

శవాసనం కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఈ ఆసనం మనిషికి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube