స్టోరీ సూపర్‌గా ఉన్నా.. ఫెయిల్ అయిన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

సాధారణంగా మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయ్యే ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ప్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేరు.స్టోరీ బాగోలేకపోయినా కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అవుతుంటాయి.

 Why These Tollywood Movies Are Flops , Nani ,ante Sundaraniki ,khaleja , Sai Pa-TeluguStop.com

ఈ సినిమాలో ఏముందని ఇది హిట్ అయిందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేయడం మనం వింటుంటాం.ఇక మరికొన్ని సినిమాల స్టోరీ అద్భుతంగా ఉన్నా ఫెయిల్ అవుతుంటాయి.

వాటిని చూసినప్పుడు ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? స్టోరీ చాలా బాగుంది కదా అని డిసప్పాయింట్ అయిపోతుంటాము.అలా రీసెంట్ టైమ్‌లో మంచి కథలతో వచ్చి ఫెయిల్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.

వాటిలో టాప్ మూవీస్ గురించి తెలుసుకుందాం.

అంటే.సుందరానికీ!

Telugu Anushka, Dear Comrade, Flops, Johnny, Khaleja, Mahesh Babu, Nani, Sai Pal

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన కామెడీ, ఫ్యామిలీ డ్రామా “అంటే.సుందరానికీ( Ante Sundaraniki )!” మంచి స్టోరీ తోనే వచ్చింది.ఇందులో నాని, నజ్రియా అద్భుతంగా నటించారు.కమర్షియల్‌గా హిట్ కాలేదు కానీ ఓటీటీలో ఇది సూపర్ హిట్ దాన్ని బట్టి కథ కొత్తగా, సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు.

విరాట పర్వం:

సాయి పల్లవి, రానా యాక్ట్ చేసిన విరాట పర్వం సినిమా కథ కూడా బాగుంటుంది.నక్సలిజం, విప్లవంలో లవ్ స్టోరీ ని మిక్స్ చేసి వేణు ఊడుగుల ఈ సినిమాని కొత్తగా తీశాడు ఇది బుల్లితెరపై బాగానే హిట్ అయింది.

ఖలేజా

Telugu Anushka, Dear Comrade, Flops, Johnny, Khaleja, Mahesh Babu, Nani, Sai Pal

మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు అనే కాన్సెప్ట్‌ను ఖలేజా సినిమాలో చూపించాడు త్రివిక్రమ్( Trivikram ) అందరికీ నచ్చేలాగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా ఇందులో యాడ్ చేశాడు కానీ ఈ మూవీని అప్పటి ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.తర్వాత ఈ సినిమా బుల్లితెర, ఓటీటీలో సూపర్‌హిట్ అయింది.ఇందులో మహేష్ బాబు కామెడీ అదిరిపోతుంది.

డియర్ కామ్రేడ్:

ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ‌ రూపొందించిన డియర్ కామ్రేడ్ ( Dear Comrade )సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుంది కామెడీ కి కూడా కొదవ ఉండదు.పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత గొప్పగా ఉంటాయి.విజయ్ రష్మిక పర్ఫామెన్స్ కూడా టాప్-నాచ్ అని చెప్పవచ్చు.కథ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.అయినా ఈ సినిమాని ప్రజలు మెచ్చకపోవడం ఇప్పటికీ ఒక అర్థం కాని అంశమే అయిపోయింది.

వేదం:

Telugu Anushka, Dear Comrade, Flops, Johnny, Khaleja, Mahesh Babu, Nani, Sai Pal

వేదం” క్రిష్ తీసిన ఉత్తమ చిత్రాలలో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుంది.సమాజాన్ని ఆలోచింపజేసేలా ఈ సినిమా కథ ఆగుతుంది.ఇందులో చూపించిన అన్ని పాత్రల కథలు మనసును హత్తుకుంటాయి.ఇదొక మాస్టర్‌పీస్ అయినా ఆ రోజుల్లో ప్రజలు థియేటర్లలో దీనిని చూడలేదు.ఫలితంగా పెద్దగా హిట్ కాలేదు.

అ!:

సైకాలజికల్ థ్రిల్లర్ అ! సరికొత్త కథతో వచ్చింది.ఇందులోనే అన్ని పాత్రల జర్నీ చాలా బాగుంటుంది.ప్రశాంత్ వర్మ మూవీ నీ తెరకెక్కించిన తీరుకు చప్పట్లు కొట్టినా తక్కువే కానీ ఈ ఫిలిం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది.

ఈ నగరానికి ఏమైంది?:

Telugu Anushka, Dear Comrade, Flops, Johnny, Khaleja, Mahesh Babu, Nani, Sai Pal

దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ సినిమా కథ చాలా బాగుంటుంది.ఇందులోని పాత్రలు ఎప్పటికీ గుర్తుని పోతాయి.అయితే ఇది బాక్సాఫీస్ పెద్దగా కలెక్షన్ వసూలు చేయలేదు.తర్వాత మాత్రం ఫ్యామిలీ లకు బాగా నచ్చేసింది.

వీటితో పాటు జానీ, 1 నేనొక్కడినే, జగడం, చక్రం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, జాను సినిమాల కథలు బాగున్నా సరే అవి మాత్రం కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube