ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.జూన్ 4వ తారీఖు ఫలితాలు రానున్నాయి.
ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రధానంగా వైసీపీ.
టీడీపీ కూటమి మధ్య పోటీ నెలకొంది.గెలుపు విషయంలో ఈ ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎవరికి వారు మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు.2014లో మాదిరిగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.దీంతో ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు.
ఇదిలా ఉండగా వైయస్ జగన్( YS Jagan ) ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని తిరుపతి జనసేన( Janasena ) కీలక నేత కిరణ్ రాయల్( Kiran Royal ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో జూన్ 9వ తారీఖున సీఎం జగన్ విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారన్న వైసీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు.ఈ ఎన్నికలలో వైయస్ జగన్ గెలిస్తే ముఖ్యమంత్రి కి తాను ఆహ్వానం పలుకుతూ తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు పోస్టర్లు అంటిస్తానని పేర్కొన్నారు.ఈసారి వైసీపీ ( YCP ) ఓడిపోబోతుందని.
బెట్టింగుల కోసం ఆ పార్టీ నేతలు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ఓటమి భయంతో ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు.
ఓడిపోతున్నారనే తెలిసే బెట్టింగులు కాసి కోట్లు కొట్టేయొచ్చని వైసీపీ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.వైసీపీ నేతల మాటలు నమ్మి ఆ పార్టీ గెలుపుపై ఎవరూ బెట్టింగులు కట్టొద్దని కిరణ్ రాయల్ సూచించారు.
అన్ని సర్వేలు కూటమికే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.