సినిమా అంటే చాలు అది మెరుపుల ప్రపంచం లేదా రంగుల ప్రపంచం అంటూ ఉంటారు.సినిమా లో హీరోయిన్స్ లేదా హీరోలు ధరించే బట్టలు బంగారం కూడా అలా కెమెరా కి చూడ్డానికి బాగుండేలానే తయారు చేస్తారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు రియల్ బంగారాన్ని( Real Gold ) కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి.మామూలుగా ఇలాంటి అవసరం చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసినప్పుడు మాత్రమే వస్తుంది.
కమర్షియల్ లేదా మాస్ సినిమాలకు అవసరం పడదు.మరి అలా రియల్ బంగారంతో షూట్ చేసిన సినిమాలు ఏంటి? వాటి కోసం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శాకుంతలం

సమంత ప్రధాన పాత్రలో నటించిన శకుంతలం సినిమా( Shaakuntalam ) ఆమె కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అందరూ భావించినప్పటికి అది దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.అయితే ఈ సినిమా కోసం మాత్రం నిర్మాత మరియు దర్శకుడైన గుణశేఖర్ ఏకంగా 14 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిజమైన బంగారాన్ని తయారు చేయించాడట.ఈ సినిమాలో సమంత ధరించిన ప్రతి నగ కూడా రియల్ బంగారమే.
రుద్రమ దేవి

రానా మరియు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమా( Rudramadevi Movie ) కోసం కూడా దర్శకుడు గుణశేఖర్ ఇలాగే చేశాడు.ఈ చిత్రంలో అనుష్క ధరించి నగలన్నీ కూడా ఒరిజినల్ బంగారమే కావడం విశేషం.ఈ సినిమాలో అది వర్కవుట్ అయ్యింది అని ఒకే ఒక్క కారణంతో శాకుంతలం సినిమాలో కూడా మరో మరో మారు ఆ ప్రయోగం చేశారు డైరెక్టర్.
పొన్నియన్ సెల్వన్

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆ భారీ హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్.( Ponniyin Selvan ) ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండడం విశేషం.అయితే ఈ సినిమాలో నటించిన త్రిష మరియు ఐశ్వర్యరాయ్ ధరించిన నగలు మొత్తం ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరి ఒరిజినల్ బంగారం తో చేయించారట డైరెక్టర్.