సినిమాల్లో ఒక వెలుగు వెలగాలని తమకంటూ స్టార్ డం సంపాదించుకోవాలని చాలామంది నటీనటులు ఎన్నో కలలు కంటూ ఉంటారు.కానీ అందరి కలలు అన్నివేళలా సరిపోవు కదా ? ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే వరకు చాలా మంది జాతకాలు ఒకలా ఉంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది మారిపోతూ ఉంటాయి.వారు చేసే సినిమాలు వారి కెరీర్ ను నిర్దేశిస్తూ ఉంటాయి.కొంతమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏదో అనుకుంటారు కానీ మరేదో జరిగిపోతూ ఉంటుంది.అందుకే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాల్లలో చేసిన మిస్టేక్స్ నుంచి త్వరగానే రియలైజ్ అయ్యి తమను తాము మలుచుకున్న కొంతమంది సెలబ్రిటీస్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
![Telugu Kollywood, Nithin-Movie Telugu Kollywood, Nithin-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/05/Varalaxmi-Sarathkumar-Vijay-Deverakonda-Nithin-kollywood-social-media.jpg)
వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ) సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయిపోవాలని కలలుగనింది.కానీ ఆమె కలలు సాధ్యం కాకపోగా ఆమె హాట్ షో చేయలేను అని తెలుసుకొని హీరోయిన్ రూల్స్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది.దాంతో ఆమె మంచి విలన్ గా, పర్ఫామర్ గా సౌత్ ఇండియాకి ఒక వరంగా దొరికింది.
ఇక విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) సైతం సినిమా విడుదలకు ముందు భారీగా హైప్ ఇవ్వడం సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు.కానీ లైగర్ సినిమా పరాజయం అతనిలో మార్పు తీసుకొచ్చింది.
ఒక మూడు నాలుగు సినిమాల వరకు ఎలాంటి హైప్ ఏ సినిమా గురించి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట.
![Telugu Kollywood, Nithin-Movie Telugu Kollywood, Nithin-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/05/Varalaxmi-Sarathkumar-Vijay-Deverakonda-Nithin-kollywood-social-media-family-star.jpg)
ఇక ఎంతో మంచి లవర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో నితిన్( Nithin) గత కొద్ది కాలంగా ఆయన మంచి మాస్ హీరోగా ఎలివేట్ అయ్యేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు ఆ క్రమంలో ఎన్నో సినిమాల్లో నటిస్తున్న అవి పరాజయాలు గానే మారుతున్నాయి.అందుకే తనకు ఎప్పుడు అచ్చచ్చిన లవ్ స్టోరీస్ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోనే తన కెరియర్ ఉంది అని తెలుసుకున్న నితిన్ ఇకపై అలాంటి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారట.ఇలా ఈ స్టార్స్ అందరూ కూడా కెరియర్ తొలినాళ్లలో చేసిన మిస్టేక్స్ ని మరలా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.