టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో నేహాశెట్టి( Neha Shetty ) బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.మరికొన్ని గంటల్లో నేహాశెట్టి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేహాశెట్టి షాకింగ్ విషయాలను వెల్లడించారు.2018 సంవత్సరంలో మెహబూబా సినిమాతో నేహాశెట్టి కెరీర్ మొదలైంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు.
ఆ తర్వాత గల్లీ రౌడీ సినిమాలో ఈ బ్యూటీ నటించగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నేహాశెట్టి గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు.డీజే టిల్లు( DJ Tillu ) సక్సెస్ తో నేహాశెట్టి ఎంతో పాపులర్ కావడం జరిగింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో బుజ్జి రోల్ రాధిక రోల్ లా నిలిచిపోతుందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అలనాటి హీరోయిన్ శోభనను( Sobhana ) స్పూర్తిగా తీసుకుని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించానని ఆమె పేర్కొన్నారు.నేహాశెట్టి చీరకట్టుకు సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.చీరకట్టులో కనిపించే పాత్రలే నాకు ఎక్కువగా వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నేహాశెట్టి నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుండటం గమనార్హం.

బన్నీ, నయనతార, అనుష్క, శ్రీదేవి నాకు నచ్చిన నటీనటులు అని నేహాశెట్టి వెల్లడించారు.నాకు గిటార్ ప్లే చేయడం, విహారయాత్రలకు వెళ్లడం చాలా ఇష్టమని నేహాశెట్టి అన్నారు.నేహాశెట్టి రెమ్యునరేషన్ కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నేహాశెట్టిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కు కూడా ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్ కాగా ఆ మ్యాజిక్ ను నేహాశెట్టి ఈ సినిమాతో సైతం రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉందని సినీ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.