ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పులు లేనిదే ఇల్లు దాటి బయటకు వెళ్లరు.ఇక ఇటీవల కాలంలో చాలామంది ఇళ్లల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.
ఇలా చెప్పులు లేనిదే ఒక్క అడుగు బయటకు వేయాలన్న కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది.ఇక సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వాళ్ళు చెప్పుల కోసం షూస్ కోసం కొన్ని లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు.
ఇలా చెప్పుల కోసం లక్షల్లో ఖర్చు పెట్టే హీరోలను మనం చూశాం కానీ ఇకపై జీవితంలో చెప్పులు వేసుకోననీ తాజాగా ఒక హీరో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
![Telugu Bicchagadu, Vijay Antony, Slippers, Toofan Trailer, Tufaan, Tufaantrailer Telugu Bicchagadu, Vijay Antony, Slippers, Toofan Trailer, Tufaan, Tufaantrailer](https://telugustop.com/wp-content/uploads/2024/05/hero-vijay-antony-decides-not-wearing-slipper-for-life-long-b.jpg)
బిచ్చగాడు(Bicchgadu ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు విజయ్ ఆంటోనీ(Vijay Antony) .ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న సినిమాలన్నింటినీ కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.త్వరలోనే విజయ్ తుఫాన్ (Tufaan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో ఈయన చెప్పులు లేకుండా కనిపించారు.
![Telugu Bicchagadu, Vijay Antony, Slippers, Toofan Trailer, Tufaan, Tufaantrailer Telugu Bicchagadu, Vijay Antony, Slippers, Toofan Trailer, Tufaan, Tufaantrailer](https://telugustop.com/wp-content/uploads/2024/05/hero-vijay-antony-decides-not-wearing-slipper-for-life-long-a.jpg)
ఇలా విజయ్ లాంటి స్టార్ హీరో చెప్పులు లేకుండా కనిపించడంతో విలేకరులు ఈ విషయం గురించి ఆయనను ప్రశ్నించారు.అయితే ఇందుకు విజయ్ సమాధానం చెబుతూ తాను గత కొద్ది రోజులుగా చెప్పులు లేకుండా నడుస్తున్నానని తెలిపారు.మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడు చాలా సులభంగా ఉందని చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.అయితే ఇకపై జీవితంలో తాను చెప్పులు లేకుండా నడవాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈయన చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ఈయన వెల్లడించలేదు.