దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరుగుతున్నాయి.ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు పూర్తయ్యాయి.
జూన్ ఒకటవ తేదీన ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికలలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలని మూడోసారి విజయం సాధించాలని బీజేపీ( BJP ) టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది.
ఆ రీతిగానే పలు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకుంది.2014లో కూడా ఈ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకుని గెలవటం జరిగింది.ఏపీలో ఎన్నికలు సమయంలో బీజేపీ పెద్దలు భారీ ఎత్తున పర్యటించడం జరిగింది.
అమిత్ షా, మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఏపీ ఎన్నికల ప్రచారాలలో కూటమి తరపున ప్రచారం చేశారు.
ఆ తరువాత ఏపీలో అమిత్ షా( Amit Shah ) ఎక్కడ కనిపించలేదు.మిగతా రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలలో నిమగ్నమయ్యారు.ఇదిలా ఉంటే రేపు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అమిత్ షా ఏపీకి రానున్నారు.
ఎన్నికల ప్రచారం ముగిశాక రాత్రి ఏడున్నర గంటలకు తిరుమల( Tirumala )కు చేరుకుని శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు.ఆ తరువాత తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కోట్ కు తిరిగి వెళ్లనున్నారు.
అమిత్ షా ఏపీ పర్యటనలో.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవుతారా.? లేదా.? అన్నది ఆసక్తికరంగా ఉంది.