ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి( Venu Swamy ) పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.వేణుస్వామి చెప్పి జాతకాలు నిజం అవుతాయో లేదో చెప్పలేం కానీ ఆయన పేరు మాత్రం మారుమ్రోగుతోంది.
అయితే ప్రముఖ నటుడు కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ వేణుస్వామి గెలుస్తాడని చెబుతున్నాడని వేణుస్వామి గతంలో బీ.ఆర్.ఎస్ గెలుస్తుందని చెబితే ఎందుకు గెలవలేదని కిర్రాక్ ఆర్పీ ప్రశ్నించారు.

కేటీఆర్ ఎందుకు సీఎం కాలేదని ఆయన అన్నారు.ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుస్తుందని వేణుస్వామి చెప్పారని అతని మాటలు నమ్మి బెట్టింగ్ కట్టిన వాళ్లు నిండా మునిగిపోయారని కిర్రాక్ ఆర్పీ( Kiraak RP ) ఫైర్ అయ్యారు.వరుణ్, లావణ్య విడిపోతారని వేణుస్వామి చెబుతున్నాడని చంద్రబాబు, పవన్, లోకేశ్ జాతకాల గురించి వేణుస్వామి కావాలనే తప్పుడు ప్రచారం చేశారని కిర్రాక్ ఆర్పీ వెల్లడించారు.

ప్రభాస్ కు హిట్ రాదని వేణుస్వామి చెబుతున్నాడని జగన్, సజ్జల కలిసి వేణుస్వామితో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని కిర్రాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేశారు.వేణుస్వామి తన భార్య శ్రీవాణిని ఎందుకు తల్లి దగ్గరకు పంపడం లేదని కిర్రాక్ ఆర్పీ అన్నారు.బ్లాక్ మనీ ఉన్న వాళ్లకే వేణు స్వామి అపాయింట్‌మెంట్ ఇస్తాడని మెల్ల కన్నును కవర్ చేసుకుంటాడని ఆయన తెలిపారు.వేణుస్వామి అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడని తెలిసిందని కిర్రాక్ ఆర్పీ అన్నారు.
కొంతమంది చంపుతామని బెదిరిస్తున్నారని హైదరాబాద్ వచ్చి చంపుకోండని ఆయన వెల్లడించారు.కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్ల గురించి వేణుస్వామి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
కిర్రాక్ ఆర్పీ కెరీర్ పరంగా ఒకింత టాప్ లో ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.కిర్రాక్ ఆర్పీ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా కెరీర్ ను జాగ్రత్తగా కొనసాగిస్తుండటం గమనార్హం.







