సినిమా ఈవెంట్లలో అందుకే ఇంగ్లీషులో మాట్లడను.. రష్మిక కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి రష్మిక మందన్న.( Rashmika Mandanna ) మొదటి సినిమా తొలి ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

 That Is The Only Reason Rashmika Does Not Speak English In Events Details, Rash-TeluguStop.com

ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో వరుస  సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇక త్వరలోనే పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Telugu English, Gam Gam Ganesha, Pushpa, Rashmika, Tollywood-Movie

ఇలా తన సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) హీరోగా నటించిన గం గం గణేశా( Gam Gam Ganesha ) అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఆనంద దేవరకొండ తో కలిసి తెలుగు( Telugu ) లో సరదాగా మాట్లాడారు.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వేడుకలో పూర్తిగా తెలుగులో మాట్లాడిన సంగతి తెలిసిందే.అయితే ఈమె తెలుగు అర్థం కాని ఒక నెటిజెన్ ఎక్స్ వేదికగా ఈమెను ఇంగ్లీష్( English )లో మాట్లాడాలని రిక్వెస్ట్ చేశారు.

Telugu English, Gam Gam Ganesha, Pushpa, Rashmika, Tollywood-Movie

ఈ విధంగా నేటిజన్ ఇంగ్లీషులో మాట్లాడమని కోరుతూ చేసినటువంటి ఈ పోస్టుపై రష్మిక స్పందించారు.అలాగే సినిమా ఈవెంట్లలో తాను ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడననే విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.ఎంతో మంది అభిమానులు నేను వారి భాషలో మాట్లాడాలని కోరుకుంటారు.అందుకే నాకు భాష రాకపోయినా కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను.ఇంగ్లిష్ లో మాట్లాడి వారందరిని అగౌరవం పరచలేను అంటూ ఈ సందర్భంగా రష్మిక చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube