గొంతు ఇన్ ఫెక్షన్ కి ఇంటి చిట్కాలు

వానాకాలం వచ్చిందంటే ముందుగా గొంతు ఇన్ఫెక్షన్ పలకరిస్తుంది.ఈ సమస్య నుండి సులభంగా బయట పడాలంటే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

అల్లం

 Natural Remedies For Sore Throats-Natural Remedies For Sore Throats-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లంలో ఉండే గుణాలు ఇన్ ఫెక్షన్ ని త్వరగా తగ్గిస్తాయి.గొంతు నొప్పిగా ఉన్నప్పుడు అల్లం ముక్కలను నమిలితే మంచి ఉపశమనం కలుగుతుంది.

అలాగే అల్లం టీ కూడా త్రాగవచ్చు.

వేడి పానీయాలు

చల్లని పదార్ధాలకు దూరంగా ఉండాలి.

వేడిగా ఉన్నవాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.అన్నం వేడిగా ఉన్నప్పుడే తినాలి.

అలాగే గోరువెచ్చని నీటిని త్రాగాలి.

మిరియాలు ఒక గ్లాస్ నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క,నాలుగు మిరియాలు వేసి మరిగించాలి.

ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి.రోజులో మూడు సార్లు తాగితే మంచి ఫలితం కనపడుతుంది.

తులసి

తులసి ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి వడకట్టి గోరువెచ్చగా అయ్యాక ఆ నీటితో పుక్కిలించాలి.

పసుపు

రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ పసుపు కలిపి త్రాగితే అముఞ్చి ఉపశమనం కలుగుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు