అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ( Former Speaker Nancy Pelosi )భర్త పాల్ పెలోసీపై( Paul Pelosi ) సుత్తితో దాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధంచగా.దీనిపై రాష్ట్ర స్థాయి విచారణ జరుగుతోంది.
డేవిడ్ డిపేప్ (44) .పెలోసీని బందీగా ఉంచడానికి ప్రయత్నించి, ఆమె భర్త పాల్ పెలోసీపై దాడి చేసినట్లు ఫెడరల్ జ్యూరీ నిర్ధారించింది.అక్టోబర్ 28, 2022న ఈ ఘటన జరగ్గా న్యాయమూర్తి నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు.అసిస్టెంట్ శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ సీన్ కొన్నోలీ( Assistant San Francisco District Attorney Sean Connolly ) మాట్లాడుతూ.
దాడి జరిగినప్పుడు పాల్ పెలోసీ వయసు 82 సంవత్సరాలని తెలిపారు.హత్యాయత్నం, ఘోరమైన ఆయుధంతో దాడి చేయడం, పెద్దలపై దురుసు ప్రవర్తన, దోపిడీ, ప్రభుత్వ అధికారికి ప్రాణహానీ కలిగించడం, సిబ్బంది లేదా కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి అభియోగాలను డిపేప్‌పై మోపారు.
డిపేప్ తరపున న్యాయవాది మాట్లాడుతూ.తన క్లయింట్ శాన్‌ఫ్రాన్సిస్కోకు( San Francisco ) ఈశాన్యంగా 20 మైళ్ల దూరంలో ఉన్న రిచ్‌మండ్‌లోని ఒక గ్యారేజ్‌లో నివసిస్తున్నాడని చెప్పారు.
అతను ‘‘స్కిజాయిడ్ పర్సనాలిటీ ’’ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని , ఇది సామాజిక సంబంధాలపై ఆసక్తి లేకపోవడంతో కూడిన మానసిక ఆరోగ్య పరిస్ధితి అని ఆయన పేర్కొన్నారు.
మే 17 నాటి తీర్పులో డిస్ట్రిక్ కోర్ట్ జడ్జి జాక్వెలిన్ స్కాట్ కోర్ల్ మే( District Court Judge Jacqueline Scott Corle May ) ఇలా అన్నారు.‘‘ నాన్సీ పెలోసీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినందుకు 20 ఏళ్లు , పాల్ పెలోసీపై దాడి చేసినందుకు 30 ఏళ్ల జైలు శిక్ష ’’ విధించారు.శిక్ష విధించే ముందు కోర్టులో ప్రసంగించడానికి డిపేప్‌ను అనుమతించలేదు.
అయితే మంగళవారం నాటి విచారణలో ఈ పొరపాటును న్యాయమూర్తి సరిదిద్దారు.దాడి సమయంలో అతను జీవితంలోనే కష్టతరమైన కాలాన్ని ఎదుర్కొంటున్నాడని .మానసిక ఆరోగ్య సమస్యలు గుర్తించబడలేదని డిపేప్ తరపు న్యాయవాదులు వ్యాఖ్యానించారు.తమ క్లయింట్‌కు నేర చరిత్ర లేదని ప్రస్తావిస్తూ.
అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించాలని వారు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
డిపేప్ తన ఫెడరల్ ట్రయల్ వాంగ్మూలంలో తాను నాన్సీ పెలోసీని బందీగా ఉంచి, ఆమెను ప్రశ్నించాలని అనుకున్నానని పేర్కొన్నాడు.రష్యాగేట్ గురించి తాను చెప్పిన అబద్ధాలను అంగీకరించకపోతే పెలోసీ మోకాలి చిప్పలను పగులగొట్టాలని ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు.తాను చేసింది తప్పేనని డిపేప్ అంగీకరించాడు.2022 మధ్యంతర ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పాల్ పెలోసీపై దాడి ఘటన పోలీసుల బాడీ క్యామ్‌లో బంధించబడింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాల్ పెలోసీ పుర్రెపై పగుళ్లు ఏర్పడగా, కుడిచేతికి గాయాలయ్యాయి.