ఎండల తీవ్రత పెరగటంతో పది రోజులపాటు పాఠశాలలు బంద్..!!

దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఎండల తీవ్రత పెరుగుతుంది.ఉదయం 9 గంటలు కాకముందే సూర్యుడు భగభగ మండుతున్నాడు.

 Schools Closed For Ten Days Due To Increasing Intensity Of Sun Bihar Governament-TeluguStop.com

ఎండ తీవ్రతతో పాటు వడగల్పులు కూడా గట్టిగా వీస్తున్నా యి.దీంతో ఎండ తీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు.గతంలో కంటే ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యాయి.దేశవ్యాప్తంగా ఒకపక్క ఎన్నికలు మరోపక్క ఎండలు తీవ్రత కారణంగా ప్రజలు తల్లడిల్లి పోతున్నారు.రాజకీయ నాయకులు సైతం ఎండలలోనే ప్రచారం చేయడం జరిగింది.ఎండలు, వర్షాలు కారణంగా ఉక్కపోత ఎక్కువైపోయింది.

బీహార్ ( Bihar )లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది.

అక్కడ ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవ్వుతున్నాయి.

దీంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.రాష్ట్రంలో మరో 10 రోజులపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసేస్తున్నట్లు ప్రకటించింది.

మే 30 నుంచి జూన్ 8 వరకు పాఠశాలలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.పాఠశాలలతో పాటు కోచింగ్ సెంటర్లు కూడా మూసేయాలని స్పష్టం చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే ఈసారి జూన్ తొలి వారంలోనే రుతుపవనాలు దేశంలోకి రాబోతున్నట్లు వాతావరణ శాఖ( Department of Meteorology ) ప్రకటన చేయడం జరిగింది.మే నెల చివరిలో కేరళకి రుతుపవనాలు రానున్నాయని.

జూన్ తొలి వారం కల్లా.దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube