ఆ రీజన్ వల్లే కల్కి మూవీ బడ్జెట్ ఎక్కువ.. స్టార్ హీరో ప్రభాస్ చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Prabhas Speaks About Kalki 2898 Ad Budget Details, Prabhas,kalki Budget, Kalki 2-TeluguStop.com

ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్.డార్లింగ్ చివరిగా నటించిన సినిమా సలార్.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది.కాగా డార్లింగ్ ప్రభాస్ త్వరలో కల్కి మూవీతో( Kalki Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.

Telugu Nag Ashwin, Kalki, Kalki Budget, Kalki Range, Kalki Actors, Pan India, Pr

త్వరలో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు నాగ్ అశ్విన్, ప్రభాస్.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. కల్కి గ్లోబల్‌ రేంజ్‌ లో ఉండనుంది.

దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాము.అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది.

దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాము.నన్ను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌( Pan India Star ) అని పిలుస్తున్నారు.

అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు.కానీ, నన్ను అలా పిలవడాన్ని అభిమానులు ఇష్టపడతారు.

Telugu Nag Ashwin, Kalki, Kalki Budget, Kalki Range, Kalki Actors, Pan India, Pr

వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్నిస్తుంది అని ప్రభాస్‌ అన్నారు.దర్శకుడు నాగ్‌ అశ్విన్‌( Director Nag Ashwin ) మాట్లాడుతూ.కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలో ఉంటారు.నేను ‘అవతార్‌’ చూశాక అలాంటి అనుభూతే పొందాను.ఒక కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించింది.ఇప్పుడు కల్కి చూశాక థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులకు అలానే అనిపిస్తుంది.

ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కోసం పెట్టాము.వీటిలో ఎలాంటి మార్పులు చేయం అని స్పష్టం చేశారు.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube