బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ పాములాంటి వ్యక్తి.. గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో సాయి రాజేశ్( Director Sai Rajesh ) ఒకరు కాగా తక్కువ సినిమాలే తెరకెక్కించినా ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్ కు మంచి పేరు వచ్చింది.అయితే గాయత్రీ గుప్తా( Gayatri Gupta ) సాయి రాజేశ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Gayatri Gupta Sensational Comments About Baby Movie Director Sai Rajesh Details,-TeluguStop.com

బేబీ సినిమా( Baby Movie ) కథను ప్రేమించొద్దు పేరుతో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారని గాయత్రీ గుప్తా వెల్లడించారు.దానిని సాయిరాజేశ్ కాపీ కొట్టేశాడని ఆమె అన్నారు.

ప్రేమించొద్దు సినిమాలో( Preminchoddu ) మొదట నన్ను హీరోయిన్ గా అనుకున్నారని అందుకు అడిషన్ కూడా జరిగిందని స్కూల్ డ్రెస్ లో నేను దిగిన ఫోటోలను సాయి రాజేశ్ గారికి చూపించానని గాయత్రి గుప్తా వెల్లడించారు.దానినే బేబీలో కాపీ కొట్టాడని ఆమె తెలిపారు.

బేబీ ట్రైలర్ రిలీజ్ తర్వాత నేను షాకయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.ఆయన డైరెక్షన్ తో ఇబ్బందులు నాకు కొత్త కాదని గాయత్రీ గుప్తా అన్నారు.

సాయి రాజేష్ కొబ్బరిమట్ట సినిమా( Kobbarimatta Movie ) విషయంలో సైతం నన్ను ఇబ్బంది పెట్టారని ఆమె పేర్కొన్నారు.ఆ సినిమాకు సంబంధించి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 25 వేల రూపాయలు మాత్రమే ఇచ్చి నన్ను టార్చర్ చేశారని గాయత్రీ గుప్తా పేర్కొన్నారు.బేబీ కథను మొదట రాసుకుంది శిరీన్ అని సాయి రాజేష్ మాత్రం ఈ కథను తాను క్రియేట్ చేశానని చెబుతాడని ఆమె తెలిపారు.

గీతా ఆర్ట్స్ సంస్థ( Geetha Arts ) పాములాంటి సాయిరాజేశ్ ను గుర్తించాలని గాయత్రీ గుప్తా తెలిపారు.సినిమాలో బేబీ రోల్ ను దారుణంగా చూపించాడని కొందరైతే ఆ పాత్ర పోస్టర్లను చెప్పులతో కూడా కొట్టారని అంతలా ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడని గాయత్రీ గుప్తా అన్నారు.సాయి రాజేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మాయని మచ్చగా మిగిలిపోతాడని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube