నైరుతి రుతుపవనాలు( Monsoon ) ముందుగానే రానున్నాయి.ఈ మేరకు రుతుపవనాలు రేపు కేరళను తాకనున్నాయి.
కాగా రెండు రోజులు ముందుగానే కేరళ( Kerala )ను రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే రానున్న 48 గంటల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని చెప్పారు.
అదేవిధంగా వచ్చే నెలలో కూడా సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రస్తుతం కేరళతో పాటు తిరువనంతపురంలో భారీ వర్షం కురిసింది.
దీంతో రోడ్లన్నీ జలమయం కాగా.వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.