జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Hyper Aadi ) గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న హైపర్ ఆది వెండి తెరపై కూడా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
సినిమాలలో నటిస్తూనే ఒకవైపు వెండితెరపై నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై కూడా తన కామెడీతో అలరిస్తున్నారు.అప్పుడప్పుడు పొలిటికల్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటాడు హైపర్.
ఇది ఇలా ఉండి తాజాగా హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ వివరాల్లోకి వెళితే.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari ).ఇందులో నేహా శెట్టి అంజలి హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.మే 31వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించింది.ప్రముఖ నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన్ను ఉద్దేశిస్తూ ఆది మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆది పడుతూ.ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేను తెలుగు వాడిని అని గర్వంగా, ధైర్యంగా చెప్పుకొంటున్నామంటే దానికి కారణం నందమూరి తారక రామారావు.

శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు.కానీ, శ్రీ కృష్ణుడిగా ఎన్టీఆర్( NTR )ని భావించి ఆయన ఫొటోలు ఇంట్లో పెట్టాం.శ్రీరాముడిగా భావించి చేతులెత్తి ఆయనకు దండం పెట్టాం.ఆయన గాంభీర్యం చూడాలంటే బొబ్బిలి పులి లోని కోర్టు సన్నివేశం ఒక్కటి చాలు.అలాంటి నటుడు, రాజకీయ నాయకుడు మళ్లీ పుట్టరు.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడం ఓ అదృష్టంగా భావిస్తున్నా.
తెలుగుజాతి గౌరవాన్ని రామారావుగారు కాపాడితే.ఆయన గౌరవాన్ని బాలకృష్ణగారు నిలబెడుతూ వస్తున్నారు.
బాలకృష్ణ తిట్టారు కొట్టారు అంటూ కొందరు వార్తలు రాస్తుంటారు.కానీ, ఆయన కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులను నిలబెట్టారు.
దాని గురించి రాయాలి.బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పేద వారికి సాయం చేశారు.
బాలకృష్ణగారితో పనిచేసే ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉంటాయి.ఒక జనరేషన్ వాళ్లు మాకు గుర్తుండిపోయే చిత్రాలు కావాలని అడిగితే ‘ఆదిత్య 369 భైరవద్వీపం లాంటి చిత్రాలు ఇచ్చారాయన.
మరో జనరేషన్ వాళ్లు యాక్షన్ సినిమాలు కావాలంటే సమరసింహారెడ్డి నరసింహారెడ్డి లాంటివి అందించారు.ఇంకో జనరేషన్ వాళ్లు కాలర్ ఎగరేసే సినిమాలు అడిగితే సింహా లాంటివి ఇచ్చారు.
జనరేషన్ మారితే మనుషులు మారతారు.టెక్నాలజీ మారుతుంది.
కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు.ఆయన గ్రాఫ్ పెరగడమే తప్ప తగ్గదు.
ఆయన సినిమాల్లో, ఓటీటీలో, రాజకీయాల్లో, సేవ చేయడంలో అన్‌స్టాపబుల్.ఆయన రాకతో మా సినిమా కలెక్షన్స్ కూడా అన్‌స్టాపబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు ఆది.