మోకాళ్ళ నొప్పులు వేధిస్తున్నాయా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

మోకాళ్ళ నొప్పులు( Knee pain ) మిమ్మ‌ల్ని తీవ్రంగా వేధిస్తున్నాయా.? మోకాళ్ళ నొప్పుల కారణంగా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారా.? వాటి నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతున్నారా.? అయితే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే లడ్డూ ఉండాల్సిందే.ఈ లడ్డూను రోజుకు ఒకటి చొప్పున రెగ్యులర్ గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులకు బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Best Way To Get Rid Of Knee Pain! Knee Pain, Knee Pain Relief Foods, Latest News-TeluguStop.com

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వాల్ నట్స్ వేసుకుని స్లైట్ గా వేయించుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న‌ వాల్ నట్స్ వేసుకోవాలి.అలాగే పది నుంచి పన్నెండు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ), వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని ఒక బాక్స్ లో నింపుకోవాలి.

ఈ బాక్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ల‌డ్డూలు ఎన్ని రోజులు అయినా నిల్వ ఉంటాయి.ఈ వాల్ నట్స్ లడ్డూల‌ను రోజుకొకటి చొప్పున ప్రతిరోజు తీసుకుంటే బలహీనమైన ఎముకలు బ‌లంగా మారతాయి.ఎముకల సాంద్రత రెట్టింపు అవుతుంది.ఫలితంగా మోకాళ్ళ నొప్పులు నుంచి విముక్తి లభిస్తుంది.కాబ‌ట్టి, మోకాళ్ళ నొప్పుల‌తో మ‌ద‌న ప‌డుతున్న‌వారు త‌ప్ప‌కుండా ఈ ల‌డ్డూల‌ను డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ వాల్ నట్స్ లడ్డూలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.

వెయిట్ లాస్ ( Weight loss )అవుతారు.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

దంపతుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

మరియు జుట్టు రాలడం సైతం త‌గ్గు ముఖం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube