టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
కాగా చెర్రీ చివరగా ఆర్ఆర్aఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రామ్ చరణ్ గా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.
ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు చెర్రీ.గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.
అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ నీ కూడా అందుకున్నారు.

ఇకపోతే చెర్రీ ప్రస్తుతం శంకర్( Shankar ) దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూనే ఉంది.ఇది ఇలా ఉంటే చరణ్ నెక్స్ట్ సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది.
అందుకు తగ్గట్లుగానే చెర్రీ తన అప్ కమింగ్ మూవీస్ ను అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తుండగా ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ తో కలిసి మరో సినిమా చేయనున్నారు చరణ్.
ఇక గేమ్ ఛేంజర్ ( Game Changer )షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఉన్న చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు.

తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయనున్నారు.కాగా RC 16 ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.ఈ మూవీకి గాను చరణ్ భారీగా పారితోషికం అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఏకంగా రూ.125 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారట.అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి RC 16 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )కూడా అంగీకరించినట్టు సమాచారం.
దాదాపు ఒకేసారి 30% పెంచారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.







