కాజల్ గొప్ప నటి అవుతుందని అప్పుడే అనుకున్నాం.. కాజల్ తండ్రి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆ రెమ్యునరేషన్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

 Kajal Agarwal Father Comments About Kajal Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

కాజల్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ కాజల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.

కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ సినిమా ( Satyabhama )రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉండగా కాజల్ బాల్యంలో పాటలు పాడిన సమయంలోనే ఆమె గొప్ప నటి అవుతుందని కల కన్నామని కాజల్ తండ్రి తెలిపారు.స్కూల్ కు వెళ్లకుండా ఉండటానికి కాజల్ చేసిన యాక్టింగ్ ను మేము నిజమేనని నమ్మామని తల్లి కామెంట్లు చేశారు.తన కూతురు ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని కాజల్ తండ్రి వినయ్ అగర్వాల్ పేర్కొన్నారు.

కాజల్ ను యాక్షన్ రోల్ లో చూడాలని అనుకున్నామని ఆ కోరిక సత్యభామతో తీరుతోందని వినయ్ అగర్వాల్ వెల్లడించడం గమనార్హం.సత్యభామ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.కాజల్ అగర్వాల్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.క్రేజ్, పాపులారిటీ పరంగా కాజల్ అగర్వాల్ ఒకింత టాప్ లో ఉన్నారు చాలా మంది హీరోయిన్లతో పోల్చి చూస్తే కాజల్ అగర్వాల్ సక్సెస్ రేట్ ఎక్కువ కావడం గమనార్హం.

కాజల్ అగర్వాల్ క్రేజ్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు.సత్యభామ సక్సెస్ సాధిస్తే మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమె ఖాతాలో చేరతాయి.కాజల్ అగర్వాల్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube