పోలీసులపై ఫైర్ అయిన స్టార్ హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ( Niveda Pethuraj )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

 Nivetha Pethuraj Argument With Police Video Goes Viral, Nivetha Pethu Raj, Argum-TeluguStop.com

ఈమె తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అన్నీ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రాలేదు.

తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.విశ్వక్ సేన్ నటించిన పాగల్, ధమ్కీ ( Pagal, Dhamki )సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది.

అయితే ప్రస్తుతం ఆమె ఎటువంటి సినిమాలలో కూడా నటించడం లేదు.అలాగే బయట ఎక్కడా కనిపించడం లేదు.కానీ తాజాగా నివేదాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.

నీవేదా వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి అని అన్నారు.

అందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా.అందుకు నివేదా నిరాకరించింది.అది తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అయితే ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేయగా.అతనిపై ఫైర్ అయ్యారు నివేదా.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.మరి ఈ వీడియో పై నివేదా థామస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube