ఈ మధ్య రోజు కి ఒక విడాకుల వార్త వింటే కానీ అందరి రోజులు గడవడం లేదు.ఆ హీరోయిన్ విడాకులు తీసుకుంటుంది, ఈ హీరో వేరే నటి తో రిలేషన్ లో ఉన్నాడు, లేదంటే ఆ స్టార్ ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది.
ఇలాంటి వార్తలు ప్రతి రోజు రాయడం మన మీడియా ఛానళ్లకు, సోషల్ మీడియాకి బాగా అలవాటయింది.ఇలాంటి ఒక గాసిప్ లేదా మసాలా లేకపోతే వ్యూస్ రావు అనేది డిసైడ్ అయ్యారో ఏమో కానీ రోజుకు ఒక వార్త వండి వడ్డించడం నిత్య కృత్యం అయిపోయింది.
ఈ దిక్కుమాలిన గాసిప్పులకి ఎప్పుడు బ్రేక్ పడుతుందో తెలియదు కానీ మీడియా వల్లే సెలబ్రిటీలు విడాకులు తీసుకునే దాకా వస్తున్నాయి నేటి రోజుల్లో.
ఇక ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా పక్క భాషల మీడియాపై పడి మరి మన తెలుగు మీడియా కోతల రాయుళ్లు సెలబ్రిటీల విడాకులకు పనులు చెబుతున్నారు.
ఉదాహరణగా చెప్పాలంటే పాకిస్తాన్ మీడియాలో సానియా మీర్జా, షోయెబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త బాగా వినిపిస్తుందని, వాళ్ళు చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారని, అసలు ఒకరితో ఒకరు కలవడం లేదని అంటూ రోజు వార్తలు వస్తున్నాయని ఇలా ఇక్కడ దిక్కుమాలిన పోస్టులన్నీ పెడుతున్నారు.అసలు ఆ పాకిస్తాన్ మీడియాలో ఈ వార్త వచ్చిందో లేదో తెలియదు కానీ వారి పేరు చెప్పుకొని మన పబ్బం గడుపుకోవడం బాగా అలవాటయింది.
తీరా చూస్తే నిన్నటికి నిన్న సానియా మీర్జా, షోయెబ్ మాలిక్ తన కొడుకు పుట్టిన రోజు ను ఘనంగా జరిపించారు.ఇది మన తెలుగు మీడియా కి నిబద్దత.
సరే సానియా మీర్జా అంటే పక్క దేశం.అక్కడ ఆ వార్త నిజంగా వస్తుంది లేదో తెలియదు.ఆ వార్త గురించి ఇక్కడ ఎందుకు అనుకుంటే ఏకంగా మన తెలుగు హీరోయిన్ స్నేహ విషయంలోనూ మన యూట్యూబ్ రాయళ్లు వారి రాతలకు పని చెప్పారు.కోలీవుడ్ లో స్నేహ, ప్రసన్నల విడాకుల గురించి మీడియా కోడైకు కూస్తుంది అంటూ రాతలు రాస్తూ చక్కగా కలిసున్న వారిద్దరికీ విడాకులు ఇచ్చేస్తున్నారు మన తెలుగు మీడియా ఉద్దండులు.
ఎవరో ఒకరు లేని ఒక వార్తతో నిప్పంటి చేస్తారు అది నిజమో కాదో తెలియకుండా ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయిపోతారు.ఇదే ఈ రోజుల్లో ఉన్న మీడియా.
నిజంగా స్నేహ, ప్రసన్న విడిపోతున్నారా అని ఒక్కసారి తమిళ మీడియాని టచ్ చేస్తే అలాంటి వార్తలు ఎక్కడా లేవు.ఇకనైనా ఈ పనులు మానుకొని ఎవరి పని వారు చేసుకుంటే బాగుంటుంది.