టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి మనందరికి తెలిసిందే.బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ వయసులోకూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చాలామంది అభిమానులు బాలయ్య బాబు మాటలకు ఆశ్చర్యపోతున్నారు.కాగా బాలయ్య బాబు మాట్లాడుతూ.
మా వాడు ఉన్నాడు ఒకడు, మోక్షు.ఇండస్ట్రీకీ వాడు రావాలి.

విశ్వక్ సేన్( Vishwak Sen ) లాంటోళ్లను వాడు స్ఫూర్తిగా తీసుకోవాలి.నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దంటాను.నేను ఇలా చెబితే నా అభిమానులు బాధపడతారు, కానీ నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దనే వాడికి చెబుతాను.విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాంటి కుర్రాళ్లను ఇన్ఫిరేషన్ గా తీసుకోమని చెబుతాను అని తెలిపారు.
అయితే బాలయ్య బాబు మాటలకు ఎక్కడ ఉన్న అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఇకపోతే ఇన్ని విషయాలు చెప్పిన బాలయ్య, మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈవెంట్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేసారు.ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే ఇందులో అంజలి కూడా కీలక పాత్రలో నటించింది.
త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.








