సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలంటే అదృష్టం కూడా కలిసిరావాలి.తెలుగులో అలా లక్ కలిసొచ్చిన నటీమణులలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు.
వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి సంక్రాంతి కానుకగా సినిమా విడుదలైతే ఆ సినిమా కచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్ సినిమాలతో ఈ సక్సెస్ సెంటిమెంట్ ప్రూవ్ అయింది.

తర్వాత సినిమాలతో సైతం వరలక్ష్మీ శరత్ కుమార్( Varalakshmi Sarathkumar ) కు భారీ విజయాలు దక్కాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వరలక్ష్మీ శరత్ కుమార్ కొంతకాలం క్రితం నిశ్చితార్థం జరుపుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.వరలక్ష్మి శరత్ కుమార్ థాయిలాండ్ ( Thailand )లో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం అందుతోంది.2012 సంవత్సరంలో వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టడం జరిగింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఎన్నో సినిమాలు చేసినా హీరోయిన్ గా మాత్రం ఆశించిన రేంజ్ లో విజయాలు దక్కలేదనే చెప్పాలి.ఆ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వరుస విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.జులై 2వ తేదీన థాయిలాండ్ లో పెళ్లి జరగనుందని పెళ్లి జరిగిన కొన్నిరోజుల తర్వాత రిసెప్షన్ జరగనుందని సమాచారం అందుతోంది.వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి తర్వాత కూడా సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ భర్త పేరు నికోలాయ్ సచ్ దేవ్( Nicholai Sachdev ) అనే సంగతి తెలిసిందే.వరలక్ష్మీ శరత్ కుమార్ కు సోషల్ మీడియాలో క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోందనే సంగతి తెలిసిందే.
వరలక్ష్మీ శరత్ కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా పెళ్లి తర్వాత వరలక్ష్మి కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.







