టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు.ఈయన ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.
ఈ సినిమా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బాలయ్య( Balayya ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ హీరోయిన్ అంజలి( Anjali ) ని వెనక్కి నెట్టేసినటువంటి సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలకృష్ణపై ట్రోల్స్ మొదలయ్యాయి.

ఇక ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది నేటిజన్స్ బాలయ్య పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.మహిళలు అంటే బాలయ్య కు చాలా చులకనని, వారిని పలు సందర్భాలలో అగౌరవ పరుస్తూ ఉంటారంటూ ఈయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అయితే తాజాగా బాలయ్య ఈ వ్యవహార శైలిపై బాలీవుడ్ దర్శకుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో హన్సల్ మెహతా( Hansal Mehta ) ఒకరు.

ఈయన దర్శకుడిగా స్కామ్1992,( Scam 1992 ) ఛల్, షాహిద్, సిటీలైట్స్, అలీఘర్ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే తాజాగా ఎక్స్ వేదికగా బాలకృష్ణ హీరోయిన్ అంజలికి సంబంధించిన ఘటన గురించి స్పందిస్తూ.ఎవరు ఈ సభ్యత సంస్కారం లేని మనిషి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.అయితే ఈ వేడుకకు బాలయ్య మందు వేసుకుని వచ్చారని ఆయన పక్కనే మందు బాటిల్ కూడా కనిపిస్తున్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే బాలకృష్ణ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను నిర్మాత నాగ వంశీ హీరో విశ్వక్ ఇద్దరు కూడా పూర్తిగా ఖండిస్తూ వీడియోలను విడుదల చేశారు.







