ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తున్న ఒక వీడియో చాలా మందిని భయపెడుతోంది.ఇది చైనాలోని ఒక డార్క్ టన్నెల్‌కు ( dark tunnel) సంబంధించినది.
ఈ వీడియోలో ఒక కారు చీకటి, సొరంగ మార్గం గుండా వెళుతోంది.సొరంగం లోపల చాలా చీకటిగా ఉండటం వల్ల ప్రయాణికులకు భయం పుడుతుంది.
కారు హెడ్‌లైట్లు ఆన్ చేసినా, సొరంగంలోని రోడ్డు గుర్తులు స్పష్టంగా కనిపించడం లేదు.సరిగ్గా వెలుతురు లేకపోవడంతో ప్రయాణం మరింత భయంకరంగా మారింది.
సొరంగ మార్గం చాలా సన్నగా ఉండటంతో ఒకేసారి ఒకే ఒక వాహనం మాత్రమే వెళ్లగలదు.డ్రైవర్ ఏదైనా చిన్న తప్పు చేసినా ప్రమాదం జరగే అవకాశం ఉంది.ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు సొరంగం ప్రమాదకరంగా ఉందని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఈ టన్నెల్(tunnel) గురించి మరింత సమాచారం కావాలని కోరుతున్నారు.
కారు టన్నెల్ లోపలకు వెళ్లినప్పుడు, నెటిజన్లు ఊపిరి బిగబట్టి మరీ చూసారు కానీ, కొన్ని నిమిషాల తరువాత, టన్నెల్ చివర కనిపిస్తుంది.ఈ దృశ్యం చూసిన వారికి ఒక ఉపశమనం లభిస్తుంది, ఎందుకంటే కష్టతరమైన ప్రయాణం చాలా వరకు ముగిసింది.ఈ వీడియో వైరల్ అయింది, లక్షలాది మంది నెటిజన్లను ఆకర్షించింది.76,000 మందికి పైగా యూజర్లు దీన్ని లైక్ చేశారు.
కొంతమంది టన్నెల్ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పాలని అడిగారు.పగటిపూట కూడా దాని భయంకరమైన రూపాన్ని ప్రశ్నించారు.కొంతమంది కారు చీకటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉపశమనం వ్యక్తం చేశారు.టన్నెల్ లోపల అమావాస్య చీకటిలాగా చిమ్మ చీకటి ఉంటుందని మరి కొంతమంది పేర్కొన్నారు.ఈ వీడియోను ఉషా వర్ధన్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నారు.4 లక్షలకు పైగా ఫాలోవర్లతో, ఆమె ఆసక్తికరమైన, ఆకట్టుకునే కంటెంట్‌ను డైలీ పోస్ట్ చేస్తుంటారు.