74 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల యువతిలా కనిపిస్తున్న వృద్ధురాలు...

ప్రముఖ అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ వెరా వాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది.సాధారణంగా ఈమె బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రస్సులు తయారు చేస్తూ పాపులర్ అయ్యింది.

 An Old Woman Who Looks Like A Young Woman Even At The Age Of 74., Vera Wang, Fas-TeluguStop.com

ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ కావడానికి మరొక కారణం ఉంది అదేంటంటే 74 ఏళ్ల వయసు వచ్చినా ఆమెలో ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కనిపించకపోవడం.ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ, ఈ వృద్ధురాలు ఇప్పటికీ చాలా శక్తివంతంగా, యాక్టివ్‌గా కనిపిస్తుంది.

అంతేకాదు 74 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ, గ్వాన్ స్టెఫానీ, అరియానా గ్రాండే వంటి అనేక ప్రముఖులకు ఆమె దుస్తులు రూపొందించింది.1990లో వోగ్ మ్యాగజైన్‌లో, రాల్ఫ్ లారెన్‌లో పనిచేసిన తర్వాత ఆమె తన స్వంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించింది.చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ, ఇప్పటికీ ఆమెకు చాలా ముఖ్యమైన క్లయింట్లు ఉన్నారు.వెరా కేవలం తన టైమ్‌లెస్ ఫ్యాషన్‌ సెన్స్, ఏజ్‌లెస్ బ్యూటీ కారణంగా చాలామందిని ఆకర్షిస్తోంది.

మే 27న, వెరా వాంగ్ ఒక స్విమ్మింగ్ పూల్ గట్టున తెల్లటి స్విమ్‌సూట్ ధరించి ఉన్న తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆమె నల్లటి సన్‌గ్లాసెస్ ధరించింది.జుట్టు నల్లగా ఒక యువతి లాగానే కనిపించింది.70 ఏళ్ల వయస్సులోనూ ఆమె పాతికేళ్ల యువతిలా చాలా యంగ్ లుక్‌తో కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు.ఆమె ఫోటోపై చాలా మంది కామెంట్స్ పోస్ట్ చేశారు, ఆమె ఇంత యవ్వనంగా కనిపిస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయారు.ఒక వ్యక్తి ఎలా ఇలా కనిపించడం సాధ్యమవుతుందని అడిగాడు, మరొకరు ఆమె ఏజ్‌లెస్ బ్యూటీ, అందానికి చిహ్నమని అన్నారు.

2020లో, వెరా వాంగ్ ఒక స్పోర్ట్స్ టాప్, షార్ట్స్ ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది, దీనిలో ఆమె ఫిట్ బాడీని చూపించింది.ఈ ముద్దుగుమ్మ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.తన రూపానికి చాలా ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ, ఆమె ఎల్లప్పుడూ తన జుట్టుకు బ్లాక్ కలర్ వేస్తానని చెబుతోంది.2023లో ఒక ఇంటర్వ్యూలో, వెరా యూత్‌ఫుల్ లుక్ గురించి మాట్లాడింది.పనిచేయడం వల్ల తన మనస్సు, ఆత్మ యవ్వనంగా ఉంటాయని ఆమె తెలిపింది.నిద్రలేమి, సన్‌స్క్రీన్ లేకుండా సూర్యరశ్మిని నివారించడం చాలా ముఖ్యమని చెప్పింది.మంచి లైటింగ్‌ను ఆస్వాదించడం, సాయంత్రం ఒక వోడ్కా డ్రింక్ తాగడం కూడా ఆమెకు ఇష్టం.సంతోషంగా, చురుకుగా ఉండటమే యవ్వనంగా కనిపించడానికి రహస్యాలు అని వెరా నమ్ముతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube