జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.డబ్బుల కోసమే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్ అని ప్రశ్నించారు.
కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు( Chandrababu ) ఎన్నో అవమానాలు చేశారని ముద్రగడ మండిపడ్డారు.కాపు ఉద్యమాన్ని అణచివేసిన చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చేతులు కలిపారని విమర్శించారు.తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా తనను, తన కుటుంబాన్ని ఎంతో వేధించారని వాపోయారు.తమ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తుంటే పవన్ కల్యాణ్ ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదని విమర్శించారు.
జగన్( CM ys jagan ) పిలుపు మేరకు వైసీపీలో చేరానన్న ఆయన కొందరు కావాలనే తనపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ స్థాయిలో ఉన్నావని నీ దగ్గరకు రావాలని పవన్ ను ప్రశ్నించారు.