రంగారెడ్డి జిల్లా( Ranga Reddy district )లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.షాద్ నగర్ మండలం నందిగామలో ఉన్న ఆల్విన్ ఫార్మసీ కంపెనీ( Alvin Pharmacy Company )లో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా చెలరేగిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కంపెనీలో మొత్తం 50 మంది కార్మికులు ఉన్నారని సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.