తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.అందులో ఈ జనరేషన్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) ఒకరు.
ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయి అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అందుకే ఆయన తమిళంలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా తన సినిమాలను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు.
ఇక ఈయన సినిమాల్లో వైవిధ్యమైన కథాంశం ఎంచుకుంటూ హీరోని ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రీన్ మీద చూపిస్తూ సినిమాలు చేస్తూ ఉంటాడు.అందువల్లే ఆయన సినిమాలు అంటే ప్రతి ప్రేక్షకుడికి చాలా బాగా నచ్చుతాయి.
ఇక ఇదిలా ఉంటే ఆయన కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ ‘ సినిమా( ‘Khaidi’ movie ) మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఇప్పుడు ‘ఖైదీ 2’ సినిమాను కూడా చేసే ఆలోచనలతో లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ప్రస్తుతం రజనీకాంత్ ( Rajinikanth )తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఖైదీ 2 సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ అయిన శ్రీలీల( Srileela ) ఒక కీలకపాత్రను పొషిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికె ఆమె తెలుగులో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు గా తెలుస్తుంది.

తమిళం లో మంచి సక్సెస్ ని అందుకుంటే అన్ని భాషల్లో తను బిజీ హీరోయిన్ గా మారిపోయే అవకాశాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే తను బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా తను అలాంటి ఒక పాత్ర ను ఎంచుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి పాత్ర పోషించబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి…
.







