ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) వ్యాఖ్యలకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్( AAG Ponnavolu Sudhakar ) కౌంటర్ ఇచ్చారు.రాజకీయ లబ్ధి కోసం షర్మిల పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు.
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉందని పొన్నవోలు సుధాకర్ ఎద్దేవా చేశారు.
అన్యాయంగా వైఎస్ఆర్ ను ( YSR ) మలినం చేస్తుంటే ఒక అడ్వొకేట్ గా తన మనసు చెలించి అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చానన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాశారన్న ఆయన ఏ తప్పూ చేయని రాజశేఖర్ రెడ్డి మీద 2011 లోనే ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
ఆగస్ట్ 17, 2011 నాడే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారన్నారు.డిసెంబర్ 2011న తాను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగిందన్న పొన్నవోలు అప్పటికీ జగన్( Jagan ) ఎవరో కూడా తనకు తెలీదని చెప్పారు.
రక్తసంబంధం, బంధుత్వం లేకపోయినా తన అంతట తాను కేసు వేశానన్నారు.వైఎస్ఆర్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చడం తప్పని తాను కేసు వేశానని స్పష్టం చేశారు.
షర్మిల తన మీద నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు.రాజకీయాల కోసం తనను బలిపశువును చేశారని వాపోయారు.
మీ రాజకీయ లబ్ధి కోసం నన్ను లాగడమేంటని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే కేసులపై చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.







