గడిచిన కాలం లో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకొని తినేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది.
ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.ఉద్యోగాలు చేస్తున్నవారికి సమయానికి చేసుకొనే తీరిక, సమయము సరిపోవడం లేదు.
అందుకే కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు వచ్చేటట్లు ఫ్రిజ్ లలో పెట్టుకుంటున్నారు.ఉదయం, మధ్యాహ్నము, రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టుకుని మరుసటిరోజు తింటున్నారు.
వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిజ్ లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తాయి.బయట వేడిగా ఉండడం వల్ల ఆహారము త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిజ్ లో పెట్టడం నేర్చుకున్నారు.
కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం అని, ఆ పదార్థాలు విషంతో సమానం అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.అటువంటి ఆహారపదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు వేసవి కాలము కాబట్టి పుచ్చకాయలను తింటే శరీరం చల్లబడుతుంది అని చాలామంది పుచ్చకాయలను తింటుంటారు.అలా తినగా మిగిలిన పండును ఫ్రిజ్ లో పెట్టుకుని మళ్ళీ తినడము జనాలకు అలవాటయిపోయింది.కానీ.ఈ కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలాగే కొందరు రాత్రి ఉల్లిగడ్డలను కట్ చేసి ఫ్రిజ్ లో పెడుతుంటారు.అలా చేయడం వల్ల ఆ ఉల్లిపాయల వాసన మిగతా వాటికి పట్టేస్తుంది.
అప్పుడు పాలు, పెరుగు తొందరగా పాడై పోవడానికి అవకాశం ఏర్పడుతుంది.మల్లెపూలు, జాజి పూలు, సువాసనగల పూలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల కూడా వాటి వాసన మిగతావాటికి పట్టుకుని తొందరగా చెడిపోతాయి.
ఫ్రిజ్ లో పెట్టిన అరటి పండ్లను కూడా మనము తినకూడదు.అలాగే బంగాళాదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చల్లదనం వల్ల అందులో చక్కెర స్థాయి పెరిగి తొందరగా పనికి రాకుండా పోతాయి.
అటువంటి ఆలుగడ్డలను ఉపయోగించడం వల్ల లేని అనారోగ్యము తెచ్చుకోవడం జరుగుతున్నది.ఫ్రిజ్ లో ఎక్కువగా పాలు, పెరుగు కొన్ని రకాల కూరగాయలను పెట్టుకోవడానికి మాత్రమే బాగుంటుంది.
కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్లో పెట్టుకొని తినడం వలన అవి విషతుల్యం అవుతాయని మన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.